ఆలస్యంగా వచ్చి.. సిబ్బందిపై దాడి

తాజా వార్తలు

Updated : 18/11/2020 11:50 IST

ఆలస్యంగా వచ్చి.. సిబ్బందిపై దాడి

అహ్మదాబాద్‌: విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వడానికి నిరాకరించిన విమానాశ్రయ అధికారులపై ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దుర్భాషలాడుతూ స్పైస్‌జెట్‌ అధికారులపై చేయిచేసుకున్నారు.

‘నవంబర్‌ 17న ముగ్గురు ప్రయాణికులు దిల్లీకి వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అందులో ఓ పోలీసు అధికారి ఉన్నారు. కానీ వారు ఆలస్యంగా రావడంతో బోర్డింగ్‌ పాస్‌ ఇచ్చేందుకు నిరాకరించాం. దీంతో వారు కౌంటర్‌ వద్ద గొడవకు దిగారు’ అని విమానాశ్రయం అధికారులు ఓ న్యూస్‌ ఏజెన్సీకి వెల్లడించారు. తీవ్ర వాదనకు దిగిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారులపై చేయిచేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. 

ఇన్‌స్పెక్టర్‌ దాడికి పాల్పడటంతో విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సైతం వెల్లడించారు. దీంతో ఆ ముగ్గురు ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో సంధి కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీంతో అధికారులు వారిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని