Viveka murder: సునీల్‌ కస్టడీ పొడిగింపు కుదరదు: పులివెందుల కోర్టు

తాజా వార్తలు

Published : 17/08/2021 01:40 IST

Viveka murder: సునీల్‌ కస్టడీ పొడిగింపు కుదరదు: పులివెందుల కోర్టు

కడప: మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. 10 రోజుల కస్టడీ ముగియడంతో ఇవాళ పులివెందుల కోర్టులో సునీల్‌ను సీబీఐ హాజరు పరిచింది. కస్టడీ గడువును పొడిగించాలని కోరింది. దీనిపై సునీల్‌ యాదవ్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రెండ్రోజులే రిమాండ్‌ గడువు ఉండటంతో కోర్టు కస్టడీకి నిరాకరించింది. మరోవైపు సునీల్‌కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. అనంతరం నిందితుడ్ని పులివెందుల కోర్టు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని