సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి..విగతజీవులై!

తాజా వార్తలు

Published : 22/03/2021 01:51 IST

సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి..విగతజీవులై!

ప్రకాశం జిల్లాలో విషాదం

వేటపాలెం: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెం సముద్రతీరంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతిచెందగా.. మరొకరు గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన మద్దూరి భరత్ రెడ్డి (20), మొగిలి ఉష(20), గట్టు మహేశ్‌ (20)తో పాటు మానస, జైశ్వంత్‌ ఆదివారం మధ్యాహ్నం కటారివారిపాలెం తీరానికి వచ్చారు. ఈ ఐదుగురూ సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యారు.

ఈ క్రమంలో స్థానికులు, మత్స్యకారులు వెంటనే వారిని గమనించి మానస, జైశ్వంత్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అనంతరం అరగంట తర్వాత భరత్ రెడ్డి, ఉషా మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మహేశ్‌ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు వేటపాలెం ఎస్సై కమలాకర్ సంఘటనా స్థలిని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను చీరాల వైద్యశాలకు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని