Illegal Affair: భర్త ఆత్మహత్య.. వేరే ఇంట్లో భార్య, ప్రియుడి మృతదేహాలు

తాజా వార్తలు

Updated : 03/09/2021 06:55 IST

Illegal Affair: భర్త ఆత్మహత్య.. వేరే ఇంట్లో భార్య, ప్రియుడి మృతదేహాలు

 

పెనుబల్లి, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం మూడు నిండుప్రాణాలను బలిగొంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లంకపల్లికి చెందిన ఇంజిమళ్ల బాలయ్య (32), కృష్ణవేణి (27) భార్యాభర్తలు. అదే కాలనీలో నివసించే పచ్చినీళ్ల ధర్మయ్య (30), కృష్ణవేణిల మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఆగస్టు 26న వారిద్దరూ ఇళ్లు వదిలి వెళ్లిపోగా, బాలయ్య 27న ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. అదే కాలనీకి చెందిన వజ్రమ్మ ఇటీవల వేంసూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లి గురువారం తిరిగి వచ్చారు. ఆమె తన ఇంటి తలుపు తీయగానే కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఏసీపీ వెంకటేశ్‌, సీఐ కరుణాకర్‌, ఎస్సై నాగరాజు వెళ్లి విచారణ ప్రారంభించారు. దుస్తుల ఆధారంగా మృతదేహాలు ధర్మయ్య, కృష్ణవేణిలవని స్థానికులు గుర్తించారు. బాలయ్య, కృష్ణవేణిల మృతితో వారి పిల్లలు చందన్‌కుమార్‌ (10), వెంకటలక్ష్మి (7) అనాథలయ్యారు. ధర్మయ్య తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ధర్మయ్యకు ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. విభేదాల నేపథ్యంలో ధర్మయ్య భార్య విస్సన్నపేట ఠాణాలో భర్తపై కేసు పెట్టారు. అతడు భార్యాబిడ్డలకు దూరంగా లంకపల్లిలోనే నివసించేవాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని