Khammam: తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 12/08/2021 21:36 IST

Khammam: తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

చింతకాని: తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన బాలిక (16) ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చుదువుతోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగడం లేదు. ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాఠాలు వినకుండా మొబైల్‌లో వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటడం గమనించిన తల్లి.. బాలికను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని