Crime News: సన్నిహితంగా మెలుగుతూ.. రైల్లో 18 నెలల చిన్నారి అపహరణ

తాజా వార్తలు

Published : 02/10/2021 07:29 IST

Crime News: సన్నిహితంగా మెలుగుతూ.. రైల్లో 18 నెలల చిన్నారి అపహరణ

రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: ఓ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ వారి చిన్నారినే అపహరించింది ఓ అపరిచితురాలు. ఒడిశా రాష్ట్రం ఒడ్డుకులకు చెందిన సుభాష్‌ కత్రియ(31)కు హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిదొరికింది. భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలతో గురువారం విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. విశాఖపట్నం-కాచిగూడ రైలులో వీరు వెళ్తున్నట్లు తెలుసుకుని తాను కూడా అదే రైలులో హైదరాబాద్‌ వెళుతున్నట్లు ఓ అపరిచిత మహిళ నమ్మించింది. వీరితోపాటు అదే బోగీలో ఎక్కింది. రాత్రి అంతా నిద్రలో ఉండగా పాపను తీసుకుని దిగిపోయింది. సీసీ టీవీల ఫుటేజీలో చిన్నారితో అపరిచితురాలు రాజమహేంద్రవరం స్టేషన్లో దిగినట్లు గుర్తించారు. మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని