యువకుల కిడ్నాప్‌.. బంధువుల అదృశ్యం

తాజా వార్తలు

Published : 21/07/2021 01:06 IST

యువకుల కిడ్నాప్‌.. బంధువుల అదృశ్యం

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో యువకుల కిడ్నాప్‌ కలకలం రేపింది. జగర్‌గుండా ప్రాంతంలోని కుందేడ్‌ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. ఈ నెల 18న కొంతమంది నక్సల్స్‌ ఆయుధాలతో కుందేడ్‌ గ్రామానికి వచ్చి ఏడుగురు యువకులను బలవంతంగా తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. 

అయితే వీరిని కాపాడేందుకు వెళ్లిన బంధువులు కూడా అదృశ్యమవడం గమనార్హం. కిడ్నాప్‌ అయిన యువకులను కాపాడేందుకు నలుగురు వ్యక్తులు అడవిలోకి వెళ్లగా.. వారు ఇంతవరకూ తిరిగిరాలేదు. కాగా.. యువకుల కిడ్నాప్‌ ఉదంతాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అపహరణకు గురైన యువకులు ఇటీవల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ కారణంగానే నక్సల్స్‌ వీరిని కిడ్నాప్‌ చేసి అజ్ఞాత ప్రాంతానికి తీసుకెళ్లి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని