HYD: డబ్బులిస్తారా.. వీడియో పెట్టమంటారా అంటూ బెదిరింపు

తాజా వార్తలు

Published : 25/07/2021 09:59 IST

HYD: డబ్బులిస్తారా.. వీడియో పెట్టమంటారా అంటూ బెదిరింపు

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డబ్బులివ్వకుంటే అశ్లీల వీడియో పెడతానంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారిని బెదిరించినట్లు బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లో నివసించే భార్యభర్త 16ఏళ్లుగా నిర్మాణ అనుబంధ రంగ వ్యాపారంలో ఉన్నారు. 2018-19 సంవత్సరంలో ఓ నిర్మాణ పనికి కేరళకు చెందిన కార్మికులను నియమించుకున్నారు. జీఎస్‌టీని సరిగా నమోదు చేయకపోవడంతో దాదాపు రూ.7 లక్షల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. డబ్బు విషయంలో కేరళ కార్మికుడు వారి అకౌంటెంట్‌ను బెదిరించసాగాడు. దంపతుల ఫోన్‌ నంబర్లు తీసుకొన్నాడు. జూన్‌ 26న గుర్తుతెలియని నంబరు నుంచి ఫోన్‌ చేసిన ఆగంతుకుడు దుర్భాషలాడాడు. ఈనెల 22న రాత్రి భర్త వాట్సప్‌కు అశ్లీల వీడియో పంపి నీ భార్యదేనని సందేశం పంపాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని