చెవిలో రిసీవర్‌.. బనియన్‌కు ఎలక్ట్రానిక్‌ పరికరం

తాజా వార్తలు

Updated : 21/07/2021 07:47 IST

చెవిలో రిసీవర్‌.. బనియన్‌కు ఎలక్ట్రానిక్‌ పరికరం

ఈనాడు, హైదరాబాద్‌: హై‘టెక్‌’ పద్ధతిలో కాపీ కొట్టడమెలా..? అంటూ గూగుల్‌లో వెతికాడు. ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని(మైక్రో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌) తయారు చేశాడు. చెవిలో రిసీవర్‌ పెట్టుకుని అటు నుంచి సమాధానాలు చెబుతుంటే విని పరీక్ష రాసి గట్టెక్కాలనుకున్నాడు. చివరకు కటకటాల్లోకి వెళ్లాడు. సరూర్‌నగర్‌ పోలీసులు హరియాణాకు చెందిన సౌరభ్‌(19) ను రిమాండ్‌కు తరలించారు.

ఇంటర్నెట్‌లో..: సౌరభ్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వాయు సేనలో ‘ఎయిర్‌మెన్‌’ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ కావడంతో గట్టెక్కడం కష్టమని గ్రహించాడు. గూగుల్‌, యూట్యూబ్‌లో చూసి ప్రత్యేక డివైజ్‌ను తయారు చేశారు. పరీక్షా కేంద్రంలో చెవిలో రిసీవర్‌తో హరియాణాలోని స్నేహితుల ద్వారా సమాధానాలు విని రాసేలా అంతా సిద్ధం చేసుకున్నాడు. శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆదివారం కర్మాన్‌ఘాట్‌లోని ఎస్‌ఈజడ్‌ టెక్నాలజీస్‌ పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. నిర్వాహకులు తనిఖీలు చేస్తుండటంతో రిసీవర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని లోదుస్తుల్లో దాచి పెట్టాడు. లోపలికెళ్లగానే రిసీవర్‌ను చెవిలో.. మరో ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని బనియన్‌కు తగిలించుకున్నాడు. హరియాణాలో ఉన్న స్నేహితులకు సిగ్నల్‌ అందేలా అంతా సెట్‌ చేసి.. తనకు కేటాయించిన కంప్యూటర్‌ దగ్గరికొచ్చి కూర్చున్నాడు. సీసీ కెమెరాల ద్వారా నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. ప్రారంభం నుంచే నిందితుడు అటు.. ఇటు కదులుతూ కనిపించాడు. నిర్వాహకులు మరోసారి క్షుణ్నంగా పరిశీలించగా రిసీవర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరం కనిపించింది. నిందితుడిని సరూర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని