Crime News: పెళ్లి పేరుతో రూ.15.35 లక్షలు కొట్టేసిన నైజీరియన్‌ అరెస్టు

తాజా వార్తలు

Updated : 18/08/2021 07:28 IST

Crime News: పెళ్లి పేరుతో రూ.15.35 లక్షలు కొట్టేసిన నైజీరియన్‌ అరెస్టు

నారాయణగూడ, న్యూస్‌టుడే: మ్యాట్రిమోని సైట్‌లో పరిచయమై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడమే కాకుండా హైదరాబాద్‌లో ఆసుపత్రి కడతానని చెప్పి ఓ యువతి నుంచి రూ.15.35 లక్షలు దండుకున్న నైజీరియన్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లిలో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఆమె తల్లిదండ్రులు మరాఠీ మాట్రిమోని సైట్‌లో బయోడేటా అప్‌లోడ్‌ చేశారు. రెండు రోజులకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన పేరు అమిత్‌ఆనంద్‌, మాది గుజరాత్‌, తన ఆరేళ్ల వయసులోనే మా అమ్మానాన్నలు ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయారు. నేను కూడా వైద్య విద్యను అభ్యసించి డాక్టర్‌గా పని చేస్తున్నానని చెప్పాడు. త్వరలోనే ఇండియాకు వచ్చి ముంబైలో స్థిరపడాలి. అక్కడే ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశానని అన్నాడు.  ఆ తర్వాత ఇద్దరు చాటింగ్‌ చేసుకున్నారు. బాధితురాలు తనను పూర్తిగా నమ్మిందని తెలుసుకున్న మోసగాడు ‘నా భార్య కోసమని పెద్ద మొత్తంలోనే బంగారు నగలు కొని పెట్టాను. ఈ నగలతో పాటు నీకు కొన్ని ఖరీదైన బహుమతులు పంపిస్తానని చెప్పాడు. రెండో రోజు దిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ చేశారు. మీకు ఖరీదైన బహుమతులతో కూడిన పెద్ద పార్శిల్‌ వచ్చింది. అయితే దానికి ఇన్‌కంటాక్స్‌. జీఎస్టీ, ఆర్‌బీఐ ఛార్జీ చెల్లించాలంటూ రూ.15.35 లక్షలు దండుకున్నాడు.

కంటి శస్త్రచికిత్స కోసం వచ్చా... నైజీరియాకు చెందిన నిందితుడు మైఖేల్‌ చిడీ (38) దిల్లీలోని ఈస్ట్‌కైలాస్‌లో ఉంటున్నాడు. సెల్‌ఫోన్‌ నంబరు, ఇతరాత్ర సాంకేతిక ఆధారాలతో హైదరాబాద్‌ సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ ఆధ్వర్యంలోని బృందం దిల్లీకి వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. అసలు నైజీరియా నుంచి భారతదేశానికి ఎందుకొచ్చావని మైఖేల్‌ను పోలీసులు ప్రశ్నించగా.. నాకు కంటిలో శుక్లాలున్నాయి. మా దగ్గరకంటే భారతదేశంలోనే అత్యాదునిక శస్త్రచికిత్సలు చేస్తారని తెలిసి వచ్చాను. వైద్యానికి తాను తెచ్చుకున్న సొమ్ము సరిపోలేదు. అందుకే ఇలా మోసం చేశానని చెప్పాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని