TS News: నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

తాజా వార్తలు

Updated : 24/08/2021 06:42 IST

TS News: నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: నాలుగేళ్ల పసిపాపపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పింగళి గణేశ్‌ అలియాస్‌ చింటూకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్‌ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేశ్‌(20) తన గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. 2020 నవంబరు 19న చాక్లెట్‌ కొనుక్కునేందుకు వచ్చిన బాలిక(4)ను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తుండగా తల్లిదండ్రులు విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని