Crime News: మ్యాట్రిమోనీ సైట్‌లో చూశా.. బాగా నచ్చావు.. పెళ్లి చేసుకుందాం 

తాజా వార్తలు

Updated : 28/09/2021 14:56 IST

Crime News: మ్యాట్రిమోనీ సైట్‌లో చూశా.. బాగా నచ్చావు.. పెళ్లి చేసుకుందాం 

ఏకాంతంగా గడిపిన వీడియోలు అంతర్జాలంలో

డబ్బు ఇచ్చినా ‘డిలీట్‌’ చేయని కేటుగాడు

ఈనాడు, హైదరాబాద్‌: మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూశాను.. బాగా నచ్చావు.. పెళ్లి చేసుకుందామంటే నమ్మింది. ఏకాంతంగా గడిపిన క్షణాలు అంతర్జాలంలో ప్రత్యక్షం కావడంతో కంగుతింది. సరూర్‌నగర్‌ చెందిన బాధితురాలు(30)  మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంది. ఓ రోజు మొబైల్‌ నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. అటువైపు నుంచి సుభాష్‌ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ ప్రొఫైల్‌ బాగా నచ్చిందని చెప్పాడు. తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. కలుద్దామని మాదాపూర్‌కు రమ్మన్నాడు. ఇద్దరు ఏప్రిల్‌ 27న ఓ రెస్టారెంట్‌లో కలిశారు. భోజనం తర్వాత తన గదికి తీసుకెళ్లాడు. ఏకాంతంగా కలిసిన సమయంలో నిందితుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. కొన్ని రోజుల తర్వాత అవి అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి. కంగుతిన్న బాధితురాలు సుభాష్‌కు కాల్‌ చేసింది. డబ్బు ఇవ్వాలని.. లేదంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. డబ్బులిచ్చినా డిలీట్‌ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని