ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్టు.. మావోయిస్టులతో సంబంధాలున్నాయని అనుమానం

తాజా వార్తలు

Updated : 01/09/2021 06:56 IST

ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్టు.. మావోయిస్టులతో సంబంధాలున్నాయని అనుమానం

చర్ల, న్యూస్‌టుడే: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన ఆయన పూసుగుప్ప-ఛత్తీస్‌గఢ్‌లోని రాంపురం-మల్లంపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని సీఐ అశోక్‌ తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన శైలేంద్ర ముఖర్జీ ఆగస్టు 7న చనిపోగా, ఆయన ఆశయాలను కొనసాగించాలని ఉన్న కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పృథ్వీరాజ్‌ను అరెస్టుచేసి న్యాయస్థానానికితరలించినట్లు సీఐ తెలిపారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని