Crime news: గుంటూరులో దారుణం.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం

తాజా వార్తలు

Published : 22/10/2021 18:40 IST

Crime news: గుంటూరులో దారుణం.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం

తాడికొండ: గుంటూరు నగర శివారులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడికొండ మండలం మోతడకలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న యువతి తన స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్తున్న సమయంలో కొందరు యువకులు వారిపై కర్రతో దాడి చేశారు. యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. యువతి, యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై బాధితులు తాడికొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని