AP News: తండ్రీకుమార్తెను కత్తులతో బెదిరించి దుండగుల దోపిడీ..

తాజా వార్తలు

Updated : 25/07/2021 08:24 IST

AP News: తండ్రీకుమార్తెను కత్తులతో బెదిరించి దుండగుల దోపిడీ..

మేడికొండూరు, న్యూస్‌టుడే: మండలంలో శుక్రవారం రాత్రి నలుగురు దుండగులు తండ్రీకూతుళ్లను కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన మూలం శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తుంటారు. శుక్రవారం ఉదయం తన 12 ఏళ్ల కుమార్తె చిన్నారికి ఆరోగ్యం బాగోలేదని కారులో గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చూపించుకొని రాత్రి ఇంటికి బయలుదేరారు. పాప ఆకలిగా ఉందనడంతో గుంటూరులోని ఓ హోటల్‌లో భోజనం పార్సిల్‌ తీసుకున్నారు. మండలంలోని విశదల అడ్డరోడ్డు వద్ద కారు ఆపి వెనుక భాగంలో కూర్చుని ఇద్దరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో ఆటోలో గుర్తు తెలియని నలుగురు దుండగులు అక్కడికి వచ్చి వారిని చుట్టుముట్టారు. ఒకడు శ్రీనివాసరావు గొంతు వద్ద కత్తి పెట్టగా, మరొకడు నోరు మూశాడు. మిగిలిన ఇద్దరూ డబ్బులు ఇమ్మంటూ చితకబాదారు. అది చూసిన చిన్నారి తండ్రిని కొట్టవద్దు అంటూ ఏడుస్తూ పెద్దగా అరవడం ప్రారంభించింది. ఇంతలో ఒకడు చిన్నారి దగ్గరకు వచ్చి నోరుమూసి భుజంపై ఎత్తుకొని కొంత దూరం తీసుకెళ్లాడు. పాపను ఏమైనా చేస్తారేమోనని భయపడిన శ్రీనివాసరావు తన జేబులో ఉన్న రూ.15 వేలు తీసి దుండగులకు ఇచ్చాడు. వారు వెంటనే పాపను వదిలేసి తమ ఆటోలో అక్కడి నుంచి విశదల వైపు పారిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితుడు శ్రీనివాసరావు మేడికొండూరు పోలీసులకు చరవాణి ద్వారా ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న దక్షిణ మండలం డీఎస్పీ ప్రశాంతి హుటాహుటినా ఘటనా స్థలికి వచ్చారు. మేడికొండూరు పోలీసులతో కలిసి నిందితుల కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం నేర విభాగం అడిషనల్‌ ఎస్పీ మనోహర్‌రావు తన సిబ్బందితో కలసి మేడికొండూరు వచ్చారు. విశదల అడ్డరోడ్డులో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించగా అది పని చేయడం లేదని గుర్తించారు. నిందితులను పట్టుకోవడం సవాల్‌గా మారింది. చుట్టుపక్కల కొందరు అనుమానితులను ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో ఉంది.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని