Crime news: కడప జిల్లాలో మహిళలపై ఆగంతకుల దాడి.. బంగారు గొలుసుల అపహరణ

తాజా వార్తలు

Published : 11/09/2021 10:50 IST

Crime news: కడప జిల్లాలో మహిళలపై ఆగంతకుల దాడి.. బంగారు గొలుసుల అపహరణ

రాయచోటి: కడప జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన చోరీ ఘటనల్లో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి పట్టణం కె. రామాపురంలోని డైట్ వసతి గృహ ఆవరణలో మహేశ్వరి (55)అనే మహిళ ఉదయపు నడక చేస్తుండగా ఓ అగంతకుడు రాయితో తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయిన మహిళ మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆమె నిలువరించడంతో మరోసారి రాయితో కొట్టి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కోడి కత్తితో దాడి..

కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీవో కాలనీలో ఓ మహిళపై దుండగుడు కోడి కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు అపహరించి పారిపోయాడు. రామాపురంలో జరిగిన ఘటన కూడా ఇతడే చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని