Crime news: బాలుడిపై లైంగిక దాడి.. ఆయాకు 20 ఏళ్ల జైలుశిక్ష

తాజా వార్తలు

Updated : 16/09/2021 20:18 IST

Crime news: బాలుడిపై లైంగిక దాడి.. ఆయాకు 20 ఏళ్ల జైలుశిక్ష

హైదరాబాద్‌: ఓ మహిళకు బాలమిత్ర కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లో వెళితే...చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని పాఠశాల ఆయా జ్యోతి లైంగికంగా వేధించింది. బాలుడి మర్మావయవాలను పట్టుకొని ఇబ్బంది పెట్టింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో బాలుడి తండ్రి 2017 డిసెంబరులో చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో సాక్ష్యాధారాలు సమర్పించారు. విచారణ అనంతరం పాఠశాల ఆయా జ్యోతికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ బాలమిత్ర కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని