Crime News: కోవూరులో భారీ పేలుడు.. ఎలా జరిగింది?

తాజా వార్తలు

Published : 25/11/2021 18:00 IST

Crime News: కోవూరులో భారీ పేలుడు.. ఎలా జరిగింది?

కోవూరు: నెల్లూరు జిల్లాలోని కోవూరు పట్టణంలో రాత్రి జరిగిన భారీ పేలుడు ఎలా జరిగిందనేది పోలీసులకు అంతుబట్టడం లేదు. పట్ణణంలోని మైథిలీ థియేటర్‌ సమీపంలోని శ్మశాన వాటికలో ఈపేలుడు జరగ్గా.. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది. విద్యుత్‌ స్తంభాలు నేలకూలగా, నివాసాల్లోని కిటికీలు, కార్ల అద్దాలు పగిలిపోయాయి. శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఇంకా ఓ నిర్థారణకు రాలేదు. కనీసం డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లు ఇక్కడ పరిశీలించకపోవడం విశేషం. దాదాపు 500 మీటర్ల వరకు పేలుడు జరిగిన భవనం రాళ్లు ఎగిరిపడ్డాయి. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నల్లమందు గానీ, జిలిటెన్‌ గానీ పేలుడుకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పరీశిలించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.పేలుడు జరిగిన ప్రదేశంలో ఏర్పడిన పెద్ద గొయ్యి.. ఇతర పరిణామాలపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని