Viveka murder case: వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ 

తాజా వార్తలు

Published : 27/07/2021 01:41 IST

Viveka murder case: వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ 

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 50వ రోజు కొనసాగింది. విచారణలో భాగంగా ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృందం ఇవాళ పులివెందుల చేరుకుంది. ఈ సందర్భంగా అధికారులు మరోసారి వివేకా ఇంటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ వద్ద ఇటీవల వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో అనుమానితులపై ప్రశ్నల వర్షం కురిపించిన సీబీఐ.. ఇవాళ పులివెందులలో విచారణ జరిపింది.    


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని