Viveka Murder Case: మీడియా ప్రతినిధులను రెండో రోజు ప్రశ్నిస్తోన్న సీబీఐ

తాజా వార్తలు

Published : 22/09/2021 12:21 IST

Viveka Murder Case: మీడియా ప్రతినిధులను రెండో రోజు ప్రశ్నిస్తోన్న సీబీఐ

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 107వ రోజు కొనసాగుతోంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో రోజు మీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికే పలు ఛానెళ్లకు నోటీసులు పంపింది. జమ్మలమడుగు కోర్టులో వివేకానందరెడ్డి ఇంటి కాపలాదారు రంగన్న వాంగ్మూలాన్ని సీబీఐ తీసుకున్న విషయం తెలిసిందే.

వివేకా హత్య జరిగిన రోజు తాను ఇద్దరిని చూసినట్లు వాంగ్మూలంలో రంగన్న చెప్పినట్లు సమాచారం. అప్పట్లో పలు ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో రంగన్న వాంగ్మూలానికి సంబంధించి కొన్ని వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ ఇద్దరు ఎవరంటూ మీడియా ప్రతినిధులు కొన్ని ఊహాచిత్రాలను ప్రసారం చేశారు. ఆ చిత్రాలు ఎవరివనే దానిపై సీబీఐ అధికారులు నిన్న మీడియా ప్రతినిధులను విచారించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని