Viveka murder case: కర్ణాటక నుంచి కడపకు బ్యాంకు, రెవెన్యూ అధికారులు 

తాజా వార్తలు

Published : 11/08/2021 13:12 IST

Viveka murder case: కర్ణాటక నుంచి కడపకు బ్యాంకు, రెవెన్యూ అధికారులు 

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 66వ రోజు కొనసాగుతోంది. ఈ హత్యకు ఆర్థిక మూలాలే కారణంగా తెలుస్తోంది. కస్టడీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణలో భాగంగా ఈ ఉదయం కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న అతిథి గృహానికి కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది వచ్చారు. వారి వద్ద ఉన్న వివేకాకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, రెవెన్యూ రికార్డులను సీబీఐ అధికారులకు ఇచ్చారు. 

అనంతరం సీబీఐ అధికారులలో కలిసి వారు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో కడప ఎస్‌బీఐకి చెందిన ముగ్గురు అధికారులను కూడా సీబీఐ విచారించింది. వివేకా కుమార్తె, అల్లుడు కూడా కడపలో సీబీఐ అధికారులను మరోసారి కలిశారు. సీబీఐకు చెందిన మరో బృందం ఈ ఉదయం పులివెందులలోని సునీల్‌యాదవ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. హత్యకేసులో ప్రధానంగా వ్యవహరించిన వారిని వదిలేసి తన కుమారుడిని ఇరికించారని రెండు రోజుల కిందట సీబీఐపై సునీల్‌ తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని