‘కత్తితో గొంతు కోసి హత్య చేశా’: చందానగర్‌ కేసులో నిందితుడు కోటిరెడ్డి 

తాజా వార్తలు

Published : 28/10/2021 01:19 IST

‘కత్తితో గొంతు కోసి హత్య చేశా’: చందానగర్‌ కేసులో నిందితుడు కోటిరెడ్డి 

హైదరాబాద్‌: నగరంలోని నల్లగండ్లలో జరిగిన నర్సు నాగచైతన్య హత్య కేసులో చందానగర్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణలో తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కత్తితో నాగచైతన్య గొంతు కోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కోటిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు. ఘటన అనంతరం గాయాలతో ఉన్న నిందితుడు భయంతో ఒంగోలు పారిపోయి అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.

అసలేం జరిగిందంటే.. 
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవదికి చెందిన నాగచైతన్య(24) హైదరాబాద్‌ నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్‌ రిప్రజంటేటివ్‌. విధుల్లో భాగంగా ఇద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరు నెలల నుంచి పెళ్లి చేసుకోవాలంటూ నాగచైతన్య.. కోటిరెడ్డిపై ఒత్తిడి తెస్తోంది. సామాజిక వర్గాలు వేరు కావడంతో కోటిరెడ్డి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 23న నల్లగండ్లలోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నారు. ఆదివారం రాత్రి వరకు తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బందికి అనుమానం వచ్చి తెరిచారు. నాగచైతన్య రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించగా.. కోటిరెడ్డి జాడ కనిపించకపోవడంతో చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని