kadapa crime news: చదివింది బీటెక్‌.. చేసేది బ్లాక్‌ మెయిల్‌

తాజా వార్తలు

Published : 02/08/2021 01:14 IST

kadapa crime news: చదివింది బీటెక్‌.. చేసేది బ్లాక్‌ మెయిల్‌

కడప: అందంతో అమ్మాయిలకు వల వేస్తాడు. ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా అమ్మాయిలు, మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని అసభ్యకరమైన రీతిలో చాటింగ్‌ చేస్తూ వారి అర్ధనగ్న ఫొటోలను సేవ్‌ చేసుకుని తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఘరానా మోసగాడ్ని కడప పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పలు కేసులు ఉన్నాయి. అరెస్టయిన దొంగను కడప డీఎస్పీ సునీల్‌ మీడియా ఎదుట హాజరుపర్చారు. 

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసన్న కుమార్‌ అలియాస్‌ ప్రశాంత్‌రెడ్డి , అలియాస్‌ రాజారెడ్డి, అలియాస్‌ టోనీ.. బీటెక్‌ వరకు చదివాడు. చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటుపడ్డాడు. 2017లో గొలుసు దొంగతనాలు, ఇళ్లలో చోరీలకు పాల్పడిన అతనిపై ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నాయి. 2020 నుంచి ప్రసన్నకుమార్‌ ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అమ్మాయిలు, మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి వారిని శారీరకంగా లోబరుచుకుని, వారి అర్ధనగ్న ఫొటోలను సేవ్‌ చేసుకుని బెదిరింపులకు గురి చేస్తుండేవాడు. వారి నుంచి పలు దఫాలుగా డబ్బులు, బంగారు నగలు వసూలు చేశాడు. కానీ, చాలా మంది మహిళలు బయటకు తెలిస్తే పరువు పోతుందని ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎట్టకేలకు కడపకు చెందిన ఓ వ్యక్తి అతని మోసానికి గురై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతన్ని చాకచక్యంగా అరెస్టుచేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను ఇప్పటి వరకు  దాదాపు 200 మందిని మోసం చేసినట్టు విచారణలో వెల్లడైంది. నిందితుడు ప్రసన్నకుమార్‌ వద్ద నుంచి రూ.1.26లక్షల నగదు, 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు  డీఎస్పీ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని