Counter Attack: దిల్లీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు నేరస్థుల మృతి

తాజా వార్తలు

Updated : 12/08/2021 10:45 IST

Counter Attack: దిల్లీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు నేరస్థుల మృతి

దిల్లీ: దేశ రాజధానిలోని కంజూరి ఖాస్‌ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అమీర్‌ఖాన్‌, రాజ్‌మాన్‌ అనే ఇద్దరు నిందితులు మృతిచెందారు. కాల్పుల్లో పోలీస్‌ కానిస్టేబుల్స్‌ సచిన్‌, లలిత్‌ తోమర్‌ గాయపడ్డారు. నిందితుల నుంచి 2 తుపాకులు, 15 క్యాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు నేరస్థులు పలు హత్యలు, దోపిడీల్లో నిందితులుగా ఉన్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

కంజూరిఖాస్‌ ప్రాంతంలోని శ్రీరామ్‌ కాలనీలో నిందితులు ఉన్నట్లు తమకు విశ్వసనీయవర్గాల ద్వారా సమచారం వచ్చినట్లు పోలీసులు చెప్పారు. దీంతో వారిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లగా నిందితులు తమపై తుపాకీలతో కాల్పులు జరిపినట్లు వివరించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితులిద్దరూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని