Crime News: హైదరాబాద్‌లో డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం

తాజా వార్తలు

Published : 23/09/2021 01:44 IST

Crime News: హైదరాబాద్‌లో డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం

హైదరాబాద్: డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరాగాళ్ళు రూ.43 లక్షలు దండుకున్నారు. హైదరాబాద్ మాదన్నపేటకి చెందిన అబ్దుల్ ఆదిల్ అనే వ్యక్తికి ఫోన్ చేసిన నేరగాళ్ళు డైమండ్స్ ట్రేడింగ్‌లో నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయని ఆశలు చూపించారు. Idex.appfact.club సైట్ ద్వారా బాధితుడితో యాప్‌ని డౌన్‌లోడ్‌ చేయించారు. పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు వస్తున్నట్టు యాప్ వాలెట్‌లో చూపించారు. ఇది నమ్మిన బాధితుడు అబ్దుల్‌ విడతల వారీగా రూ.43 లక్షలు వారి ఖాతాల్లోకి బదిలీ చేశాడు. అనంతరం యాప్ లింక్‌ను డిలీట్ చేయడంతో మోసపోయానని గ్రహించిన అబ్దుల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని