Crime News: హైదరాబాద్‌లో బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం

తాజా వార్తలు

Published : 23/09/2021 22:11 IST

Crime News: హైదరాబాద్‌లో బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం

హైదరాబాద్‌: పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తూనే ఉన్నారు. తాజాగా బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ పేరుతో హైదరాబాద్‌లో సైబర్‌ నేరగాళ్లు మరో భారీ మోసానికి పాల్పడ్డారు. నగరంలోని హబ్సిగూడకు చెందిన వెంకట్ అనే వ్యక్తిని ట్రాప్‌ చేసి కాయిన్‌ యూఎఫ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. విడతల వారీగా బాధితుడి నుంచి రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం యాప్‌ను డిలీట్‌ చేశారు. ఇలా మూడు రోజుల్లో ముగ్గురిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు.. దాదాపు రూ.60 లక్షలు కాజేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని