VSP NEWS: నగ్న వీడియోకాల్‌  రికార్డు చేసి.. ఉన్నదంతా ఊడ్చేశారు

తాజా వార్తలు

Published : 12/08/2021 01:35 IST

VSP NEWS: నగ్న వీడియోకాల్‌  రికార్డు చేసి.. ఉన్నదంతా ఊడ్చేశారు

విశాఖ: విశాఖపట్నంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాల్‌ మీ ఎనీటైమ్‌ మెసేజ్‌తో విశాఖలో భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ముఠా ఉచ్చులో చిక్కుకున్న ప్రవీణ్‌ అనే యువకుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

ప్రణీత్‌ నగ్న వీడియోకాల్‌ రికార్డు చేసిన ముఠా బెదిరింపులకు దిగింది. యువకుడి నుంచి పలుమార్లు రూ.24లక్షలు వసూలు చేశారు. బెదిరింపులు తట్టుకోలేక ప్రణీత్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠాకు చెందిన మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.5లక్షలు, ల్యాప్‌టాప్‌, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్టు క్రైమ్‌ డీసీపీ సురేశ్‌బాబు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని