hyderabad crime: పీఎఫ్‌ పేరుతో రూ.9లక్షలు కాజేశారు

తాజా వార్తలు

Updated : 08/08/2021 05:06 IST

hyderabad crime: పీఎఫ్‌ పేరుతో రూ.9లక్షలు కాజేశారు

హైదరాబాద్‌: ప్రభుత్వ విశ్రాంత మహిళా ఉద్యోగిని పీఎఫ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ప్రావిడెంట్ ఫండ్‌(పీఎఫ్‌) కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నామని ఆమెను నమ్మించారు. మీకు రావాల్సిన పీఎఫ్‌ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, అందుకోసం ట్యాక్స్‌ ముందుగానే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని చెప్పి బ్యాంక్‌ డెబిట్‌ కార్డు, సీవీవీ నంబరు తీసుకున్నారు. ఆమె ఫోన్‌కి వచ్చిన ఓటీపీ నెంబర్లు కూడా తీసుకుని నాలుగు విడతలుగా  మొత్తం రూ.9లక్షలు కాజేశారు. ఆ తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ అని రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని