CYBER CRIME: సైబర్‌ కేటుగాళ్ల కొత్త తరహా మోసాలు..

తాజా వార్తలు

Updated : 31/07/2021 04:38 IST

CYBER CRIME: సైబర్‌ కేటుగాళ్ల కొత్త తరహా మోసాలు..

హైదరాబాద్‌: సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.20వేలు డెబిట్‌ అయ్యాయని మెహిదీపట్నంకు చెందిన అబ్దుల్ సమద్‌ ఫోన్‌కు సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌ పంపారు. డబ్బులు రికవరీ కావాలంటే మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయాలని చెప్పి, ఆ  తర్వాత సమద్‌ ఫోన్‌కు లింక్‌ పంపారు. డెబిట్‌ కార్డు వివరాలు నమోదు చేయించుకుని, ఓటీపీలు చెప్పించుకొని రూ.6లక్షలకు పైగా కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డెంటర్‌ సర్జికల్స్‌ సప్లయ్‌ చేస్తామని నమ్మించి...

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకి చెందిన సయ్యద్‌ మాజిద్‌ హుస్సేన్‌ డెంటర్‌ సర్జికల్‌ పరికరాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశాడు. పరికరాలు సప్లయ్‌ చేస్తామని నమ్మించిన సైబర్‌ చీటర్స్‌ రూ.2.70 లక్షలు కాజేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకుని ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. చీటింగ్‌ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని