ట్యాంకరు కింద పడి తండ్రీ కుమారుడు మృతి
close

తాజా వార్తలు

Published : 22/07/2021 01:16 IST

ట్యాంకరు కింద పడి తండ్రీ కుమారుడు మృతి

దొనకొండ: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి తండ్రి, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కొండెబోయిన కొండయ్య(35), ఆయన కుమారుడు శివనాగరాజు(14) ద్విచక్ర వాహనంపై చందవరానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నీళ్ల ట్యాంకరుతో వెళ్తున్న ట్రాక్టరును ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరూ ట్రాక్టరు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని