Fire accident: ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Updated : 27/10/2021 10:57 IST

Fire accident: ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం

ఉట్నూరు: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఉట్నూరు క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రమాదంతో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని