HYD: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

తాజా వార్తలు

Updated : 28/07/2021 10:39 IST

HYD: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని నాసెన్స్ ల్యాబ్ & కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న కొన్ని నాలుగు రియాక్టర్లు భారీ శబ్ధంతో పేలాయి. ప్రమాదంలో హరిప్రసాద్‌, అర్జున్‌, మనీష్‌ బస్కీ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్‌ అనే కార్మికుడి ఆచూకీ తెలియడం లేదు. పరిశ్రమలోని రసాయన డ్రమ్ములు భారీ శబ్దాలతో పేలుతున్నాయి. ప్రమాదం జరిగిన స్థలంలో మరో ఏడు వరకు రియాక్టర్లు ఉన్నాయి. వాటికి మంటలు వ్యాపించకుండా నాలుగు ఫైర్‌ ఇంజిన్లు, ఆరు ట్యాంకర్లతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వైద్యశాలకు తరలించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని