Guntur: యడ్లపాడులోని వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో నష్టం

తాజా వార్తలు

Updated : 24/09/2021 21:01 IST

Guntur: యడ్లపాడులోని వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో నష్టం

యడ్లపాడు: గుంటూరు జిల్లాలోని ఓ వస్త్ర పరిశ్రమలో శుక్రవారం రాత్రి  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యడ్లపాడులోని ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌ టైల్స్‌కు సంబంధించిన గోదాములో మంటలు చెలరేగాయి. కంపెనీలో తయారైన వస్త్రాలను గోదాములో నిల్వ ఉంచారు. అక్కడే అగ్ని ప్రమాదం జరిగి సరకు మొత్తం దగ్ధమైంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. యడ్లపాడు, చిలకలూరిపేటతో పాటు గుంటూరు నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నష్టం విలువ రూ.కోట్లలో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని