Crime news: ఏపీలోనూ ఎఫ్‌డీల గోల్‌మాల్‌ ప్రకంపనలు.. ఇప్పటికే రెండు చోట్ల గుర్తింపు

తాజా వార్తలు

Published : 14/10/2021 02:38 IST

Crime news: ఏపీలోనూ ఎఫ్‌డీల గోల్‌మాల్‌ ప్రకంపనలు.. ఇప్పటికే రెండు చోట్ల గుర్తింపు

అమరావతి: రాష్ట్ర గోదాముల సంస్థ, ఆయిల్‌ఫెడ్‌లో బయటపడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాయంపై ఆయా సంస్థల అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాముల సంస్థకు సంబంధించి భవానీపురంలోని ఐవోబీలో తొమ్మిది విడతలుగా రూ.9.5కోట్లు అధికారులు ఎఫ్‌డీ చేశారు. ఇటీవల ఆరాతీయగా.. డిపాజిట్‌ను గడువు తీరకుండానే మాయం చేసినట్టు తేలింది. దీనిపై సంస్థ అధికారులు భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సమగ్ర వివరాలతో ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో తిరిగి వెళ్లినట్టు తెలిసింది. పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయనున్నట్టు సమచారం. గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెంలో ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 5 దఫాలుగా రూ.5కోట్లు అయిల్‌ఫెడ్‌ సంస్థకు చెందిన అధికారులు ఈఏడాది మేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. వీటి గడువు తేదీ వచ్చే ఏడాది మే వరకు ఉంది.

ఇటీవల తెలుగు అకాడమీలో వెలుగు చూసిన ఎఫ్‌డీల కుంభకోణం తర్వాత ఆయిల్‌ఫెడ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు ఫోన్‌ చేసి ఎఫ్‌డీల వివరాలు అడిగారు. వాటిని నెల రోజులకే జూన్‌లో డ్రా చేశారుగా అని బ్యాంకు అధికారులు సమాధానం చెప్పడంతో నిర్ఘాంతపోవడం ఆయిల్‌ఫెడ్‌ అధికారుల వంతైంది. దీంతో ఈ కుంభకోణంపై సంస్థ అధికారులు గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది. ఈరెండు ఫిర్యాదులపై గురువారం కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని