AP News: మహిళలు ఎరగా వ్యక్తుల అర్ధనగ్న ఫొటోలు.. బెదిరిస్తున్న ముఠా అరెస్టు

తాజా వార్తలు

Published : 24/08/2021 01:40 IST

AP News: మహిళలు ఎరగా వ్యక్తుల అర్ధనగ్న ఫొటోలు.. బెదిరిస్తున్న ముఠా అరెస్టు

కర్నూలు: అర్ధనగ్న ఫొటోలు అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న బంగారుపేటకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులు మహిళల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తులను ఇంటికి పిలిపించుకొని మహిళలు అర్ధనగ్న ఫొటోలు తీస్తారు. అనంతరం ఆ ఫొటోలను అడ్డు పెట్టుకొని నిందితులు డబ్బు కోసం బాధితులను బెదిరిస్తారని విచారణలో తేలింది.
ఈ ముఠా 20 రోజుల్లో ఇద్దరిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక లేబర్‌ కాలనీకి చెందిన వ్యక్తి నుంచి రూ.1.20 లక్షలు, రామ్‌రహీంనగర్‌వాసి నుంచి రూ.8లక్షల విలువైన చెక్కులు వసూలు చేసినట్లు చెప్పారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని