Crime News: విశాఖలో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద మృతి

తాజా వార్తలు

Updated : 06/10/2021 09:12 IST

Crime News: విశాఖలో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద మృతి

విశాఖ: విశాఖలోని అగనంపూడిలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. శనివాడలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద మంగళవారం రాత్రి 9 గంటలకు బాలిక అదృశ్యమైంది. బాలిక కోసం కుటుంబీకులు, స్థానికులు వెతుకుతుండగా అపార్ట్‌మెంట్‌ వద్దే మృతదేహాన్ని గుర్తించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం విశాఖకు వచ్చింది. అగనంపూడిలో ఓ అపార్ట్‌మెంట్‌లో పనికి చేరింది. వారి 13ఏళ్ల కుమార్తె నిన్న రాత్రి నుంచి అదృశ్యమై చివరికి విగతజీవిగా కనిపించింది. ఎవరో హత్య చేసి పడేసినట్లుగా భావిస్తున్న తల్లిదండ్రులు కూర్మన్నపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతదేహంతో ఆందోళన చేపట్టారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని