Goa Liquor: గోవా TO నరసరావుపేట@ అక్రమ మద్యం సరఫరా 

తాజా వార్తలు

Updated : 05/09/2021 16:48 IST

Goa Liquor: గోవా TO నరసరావుపేట@ అక్రమ మద్యం సరఫరా 

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ పరిధిలో రూ.6.5 లక్షల విలువైన మద్యం సీసాలను పోలీసులు సీజ్‌ చేశారు. నరసరావుపేట ఎస్ఈబీ అధికారులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టగా లారీలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన దండే క్రాంతికుమార్‌, కడపకు చెందిన దండే చైతన్యకుమార్‌లు గోవా నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకువచ్చి చుట్టుపక్కల గ్రామాల్లోని విక్రయదారులకు సరఫరా చేస్తున్నారని ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వాహన తనిఖీలు చేపట్టి మద్యం తరలిస్తున్న ఐషర్‌ లారీని పట్టుకున్నారు. తనిఖీల్లో సుమారు రూ.6.50 లక్షల విలువ చేసే 2005 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని లారీని సీజ్‌ చేశారు. అక్రమంగా గోవా నుంచి మద్యం తరలిస్తున్న ఐదుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నామని వారిపై కేసు నమోదు చేశామని చంద్రశేఖర రెడ్డి వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని