Crime News: కాపురానికి రాలేదని భార్య గొంతుకోశాడు

తాజా వార్తలు

Updated : 25/10/2021 08:19 IST

Crime News: కాపురానికి రాలేదని భార్య గొంతుకోశాడు

చిత్తూరు జిల్లాలో దారుణం

సోమల, న్యూస్‌టుడే: పిలిచిన వెంటనే పుట్టింటి నుంచి కాపురానికి రాలేదన్న ఆగ్రహంతో భర్త కత్తితో భార్య గొంతుకోసి పరారయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... చిత్తూరు జిల్లా సోమల మండలం 81.ఉప్పరపల్లె పంచాయతీ మల్లోలపల్లెకు చెందిన భాగ్యశ్రీకి మూడేళ్ల క్రితం పూతలపట్టు మండలం దొమ్మాల్లపల్లెకు చెందిన వెంకటాద్రితో వివాహమైంది. వీరికి 9 నెలల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. మూడు రోజుల కిందట ఆరోగ్యం సరిగాలేక భాగ్యశ్రీ పుట్టింటికి వచ్చింది. ఆదివారం అక్కడికి వచ్చిన వెంకటాద్రి.. తనతో పాటు రావాల్సిందిగా భార్యను కోరగా కొద్ది రోజుల తరువాత వస్తానని చెప్పింది. ఈ విషయమై ఆగ్రహంతో ఉన్న భర్త ఆసుపత్రిలో చూపించుకొని వస్తామని నమ్మబలికి ద్విచక్ర వాహనంపై ఆమెను తీసుకొని సోమలకు బయలుదేరాడు. మార్గమధ్యలో అడుసుపల్లె పొలాల వద్ద వాహనం ఆపి భార్యను కత్తితో విచక్షణారహితంగా గాయపరిచి.. గొంతు కోశాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలోని రైతులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు పీహెచ్‌సీకి.. అనంతరం పీలేరు ఆసుపత్రికి.. అక్కడి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆమె మృత్యువుతో పోరాడుతోంది. సంఘటనా స్థలాన్ని సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్సై లక్మీకాంత్‌ పరిశీలించారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని