పతీ సహగమనం.. భార్య చితిలోకి దూకిన భర్త

తాజా వార్తలు

Updated : 26/08/2021 06:46 IST

పతీ సహగమనం.. భార్య చితిలోకి దూకిన భర్త

కటక్‌, న్యూస్‌టుడే: ఇన్నాళ్లు కష్టాలు, సుఖాలు పంచుకున్న భార్య ఇక లేదన్న నిజాన్ని ఆ వృద్ధుడు తట్టుకోలేకపోయాడు. తమ మూడుముళ్ల బంధానికి మృత్యువే ముగింపు అన్నట్లు కాలుతున్న భార్య చితిలో దూకేశాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లా గోలముండా సమితిలోని శైలుజోడి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాయబారి (60), నీలమణి శబర(65) భార్యభర్తలు. రాయబారి మంగళవారం గుండెపోటుతో మరణించింది. నలుగురు కుమారులు, భర్త, గ్రామస్థులతో కలిసి గ్రామ శివారుల్లోని శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ చితి పేర్చి మృతదేహానికి నిప్పంటించి.. అందరూ ఇళ్లకు బయలుదేరారు. అందరితోపాటే ఇంటికి బయలుదేరిన నీలమణి కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి పరుగున వెళ్లి చితి మంటల్లో దూకేశాడు. అందరూ చూస్తుండగానే ఒకే చితిలో భార్యాభర్తలు కాలిపోయారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని