Hyderabad News: తాబేళ్ల అక్రమ రవాణా ముఠా అరెస్టు

తాజా వార్తలు

Updated : 01/08/2021 05:09 IST

Hyderabad News: తాబేళ్ల అక్రమ రవాణా ముఠా అరెస్టు

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ నుంచి రైళ్ల ద్వారా హైదరాబాద్‌కు తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠాను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వన్యప్రాణి సంరక్షణా చట్టం మొదటి షెడ్యూల్‌లో ఉన్న ఇండియన్ టెంట్ లేదా అసోం రూఫ్ట్ తాబేళ్లను పట్టుకోవడం, తరలించడం, అమ్మడం నేరం. అయితే యూపీకి చెందిన శివబాలక్, రాహుల్ కశ్యప్ లఖ్‌నవూ సమీపంలోని గోమతి నదిలో వాటిని పట్టుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పెంపుడు జంతువుల దుకాణాలు, అక్వేరియం షాపుల నిర్వాహకులకు వాటిని విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీశాఖ విజిలెన్స్ అధికారి రాజారమణారెడ్డి నేతృత్వంలోని బృందం కొనుగోలుదారులుగా వెళ్లి హైదరాబాద్ రామంతాపూర్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 330 ఇండియన్ టెంట్ రకం తాబేళ్లను స్వాధీనం చేసుకొని ఉప్పల్ రేంజ్ అటవీ అధికారికి అప్పగించారు. తదుపరి విచారణ పోలీసుల ద్వారా కొనసాగుతుందన్న రాజారమణా రెడ్డి.. తాబేళ్లను కొనడం, అమ్మటం నిషేధమని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. తాబేళ్లను ఇళ్లలో పెంచుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తాబేళ్లను తరలించి అమ్ముతున్న విధానంపై తదుపరి విచారణ కోసం వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరోకు పీసీసీఎఫ్ శోభ లేఖ రాశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని