Karvy: బెంగళూరు పోలీసుల కస్టడీలోకి కార్వీ మాజీ ఎండీ పార్థసారధి

తాజా వార్తలు

Published : 22/09/2021 13:25 IST

Karvy: బెంగళూరు పోలీసుల కస్టడీలోకి కార్వీ మాజీ ఎండీ పార్థసారధి

హైదరాబాద్‌: కార్వీ కేసులో ఆ సంస్థ మాజీ ఎండీ పార్థసారధిని బెంగళూరు పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నెల 8న బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌లో పార్థసారధిపై కేసు నమోదైంది. రూ.109 కోట్ల మోసం కేసులో పార్థసారధితో పాటు కార్వీ సీఈవో రాజీవ్‌ రంజన్‌, సీఎఫ్‌వో కృష్ణపై కేసులు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై మూడు రోజుల కస్టడీకి బెంగళూరు పోలీసులు అనుమతి కోరగా.. కోర్టు సమ్మతించింది. దీంతో చంచల్‌గూడ జైలు నుంచే నిందితులను బెంగళూరు పోలీసులు విచారించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కార్వీ అనుబంధ సంస్థల కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని