బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

తాజా వార్తలు

Updated : 21/07/2021 05:54 IST

బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

హైదరాబాద్‌: ఏడేళ్ల బాలుడిపై లైంగికదాడి చేసి హత్య చేసిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జల్‌పల్లి న్యూ హుడా కాలనీకి చెందిన ఒమర్ బిన్ వ్యసనాలకు అలవాటు పడి ఆకతాయిలా తిరిగేవాడు. కిరాణా షాపుకు వెళ్తున్న బాలుడిని ఒమర్ బిన్ చాక్లెట్ ఆశ చూపించి ఎత్తుకెళ్లాడు. సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బాలుడిపై లైంగిక దాడి చేశాడు. కేకలు వేస్తున్న బాలుడిని ఆ తర్వాత నేలకేసి బాదాడు. తలకు తీవ్రమైన గాయాలవడంతో బాలుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బాలుడి కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ లోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 2019 మే 8న ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను బాలాపూర్ పోలీసులు న్యాయస్థానంలో సమర్పించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఒమర్ బిన్ హసన్‌ను దోషిగా తేల్చింది. ఒమర్‌ బిన్‌కు జీవిత ఖైదుతోపాటు రూ. 7వేలు జరిమనా విధించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని