Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం.. ముగ్గురిని బలిగొన్న లారీ

తాజా వార్తలు

Published : 11/09/2021 02:20 IST

Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం.. ముగ్గురిని బలిగొన్న లారీ

పాలకీడు: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్‌పహడ్‌ రైల్వే ట్రాక్‌ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. జాన్‌పహడ్‌ దర్గా నుంచి శూన్యపహడ్‌ వెళ్లే మార్గంలో లారీ అదుపు తప్పి ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులతో పాటు, మరో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందారు. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ సమీపంలోని జంకుతండాకు చెందిన దంపతులు దనావత్‌ పున్యా(55), దనావత్‌ మగ్తి(50)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని