ఫోన్‌ మాట్లాడుతూ భవనంపై నుంచి పడ్డాడు

తాజా వార్తలు

Updated : 18/07/2021 00:15 IST

ఫోన్‌ మాట్లాడుతూ భవనంపై నుంచి పడ్డాడు

హైదరాబాద్‌: సోదరుడితో వీడియోకాల్‌ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు రెండో అంతస్తు నుంచి కిందపడ్డాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మణికొండలో నివాసముండే తాళ్ళూరి శ్యామ్యూల్ సుజిత్(32) ఈరోజు ఉదయం తన సోదరుడితో ఫోన్‌లో వీడియోకాల్ మాట్లాడుతుండగా రెండో అంతస్తు బాల్కనీ నుంచి జారీ పడ్డాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగవారు వెంటనే సుజిత్ కుటుంబసభ్యులకు సమచారం అందించారు. గాయపడ్డ సుజిత్‌ను దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుజిత్‌ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుని సోదరుడు సుశీల్ బాగ్యరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని