TS NEWS: మరిపెడ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

తాజా వార్తలు

Published : 03/08/2021 19:10 IST

TS NEWS: మరిపెడ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలో ఓ మహిళా ట్రైనీ ఎస్‌పై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్‌ఐ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీపీని కోరారు. గత రాత్రి ఎస్‌ఐ అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించిన ఉన్నతాధికారులు మరిపెడ ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని