Crime news: భార్య ప్రాణం తీసుకుంటుంటే.. సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన భర్త

తాజా వార్తలు

Published : 22/09/2021 17:09 IST

Crime news: భార్య ప్రాణం తీసుకుంటుంటే.. సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన భర్త

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త అడ్డుకోకుండా ఆమెను ప్రోత్సహించాడు. కళ్ల ముందే ఆమె ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా తాపీగా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలను ఆమె బంధువులకు పంపించాడు. మృతురాలు ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేస్తున్న కొండమ్మగా గుర్తించారు. పైశాచిక భర్త పెంచలయ్యపై  ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెప్మా సిబ్బంది ఆందోళనకు దిగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని