AP News: గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం

తాజా వార్తలు

Updated : 16/10/2021 19:34 IST

AP News: గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన నాలుగు రోజుల మగ శిశువు ఆచూకీ లభ్యమైంది. వార్డ్‌ బాయ్‌ హేమ వరుణుడు శిశువును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. మరో మహిళతో కలిసి నిందితుడు చిన్నారిని అపహరించినట్లు తేల్చారు. గుంటూరు నెహ్రునగర్‌ సమీపంలో శిశువును దాచిపెట్టినట్లు పోలీసులు వివరించారు. మోతీలాల్‌నగర్‌ ఒకటో లైన్‌లో శిశువును గుర్తించినట్లు తెలిపారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని