TS News: వెంటాడి.. చంపేశాడు..

తాజా వార్తలు

Updated : 20/07/2021 06:44 IST

TS News: వెంటాడి.. చంపేశాడు..

భార్య, మామ గొంతు కోసి హత్య
కరీంనగర్‌ జిల్లాలో దారుణం

మానకొండూర్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన మామలను వెంటాడి మరీ అంతమొందించాడో ప్రబుద్ధుడు. ఇద్దరినీ తన సోదరుడి సాయంతో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం శ్రీనివాస్‌నగర్‌ గుట్ట సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు... వెల్దికి గ్రామానికి చెందిన లావణ్య(34), అన్నారానికి చెందిన గుడాల రమేశ్‌ భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గత రెండు నెలలుగా దూరంగా ఉంటున్నారు. పుట్టింటిలో ఉంటున్న లావణ్య తన భర్తపై కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ దంపతులిద్దరికీ నచ్చజెప్పారు. ఈ విషయమై రమేశ్‌ మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి భార్య లావణ్య, మామ ఓదేలు(60) కుమారుడు అజిత్‌, కుమార్తె అక్షిత ఆటోలో వెల్దికి వస్తుండగా.. రమేశ్‌, అతని సోదరుడు అనిల్‌ ద్విచక్రవాహనంపై వారిని వెంబడించారు. ఆటోను ఆపి భార్య, మామపై దాడిచేసి కత్తితో గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. దాడిని అడ్డుకోబోయిన కుమార్తె చేతికి గాయమైంది. అనంతరం నిందితులిద్దరూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఏసీపీ విజయసారథి, సీఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రమేశ్‌ ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. మామ ఓదేలు సింగరేణి విశ్రాంత ఉద్యోగి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని