ఫ్రిజ్‌లో తాత మృతదేహం... అంత్యక్రియలకు డబ్బుల్లేకే అంటున్న మనవడు

తాజా వార్తలు

Updated : 12/08/2021 16:01 IST

ఫ్రిజ్‌లో తాత మృతదేహం... అంత్యక్రియలకు డబ్బుల్లేకే అంటున్న మనవడు

పరకాల: అంత్యక్రియలకు డబ్బుల్లేవని తాత మృతదేహాన్ని మనవడు ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాలలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన విశ్రాంత ఉద్యోగి బాలయ్య(93) తన మనవడు నిఖిల్‌తో కలిసి పరకాలలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బాలయ్యకు వచ్చే పింఛను డబ్బులతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 3 రోజుల క్రితం బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేకపోవడంతో తాత మృతదేహాన్ని నిఖిల్‌ ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టాడు. గురువారం చుట్టుపక్కల వారికి బాలయ్య ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ శివరామయ్య, సీఐ మహేందర్‌రెడ్డి సిబ్బందితో చేరుకొని ఫ్రిజ్‌లో ఉన్న శవాన్ని చూసి అవాక్కయ్యారు. వృద్ధుడి మృతిపై ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేకపోవడంతోనే మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టానని నిఖిల్‌ స్థానికులు, పోలీసులకు వివరించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని