Crime News: యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌.. హైదరాబాద్‌లో ముఠా అరెస్టు

తాజా వార్తలు

Updated : 26/10/2021 18:23 IST

Crime News: యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌.. హైదరాబాద్‌లో ముఠా అరెస్టు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాను ఎల్బీ నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.14.92 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లపై క్రికెట్‌ లైవ్ గురు యాప్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మీడియాకు వెల్లడించారు. ఆదివారం జరిగిన భారత్‌xపాకిస్థాన్‌ మ్యాచ్‌, నిన్న జరిగిన అఫ్గాన్‌xస్కాట్‌ల్యాండ్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ జరిగినట్లు చెప్పారు. అంతేకాకుండా టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇవాళ జరగనున్న రెండు మ్యాచ్‌లపై కూడా బెట్టింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. బెట్టింగ్‌ గురించి ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ పేర్కొన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని